ఎయిర్ ఇండియా పైలట్ కు కరోనా..ఫ్లైట్ రిటర్న్

ఎయిర్ ఇండియా పైలట్ కు కరోనా..ఫ్లైట్ రిటర్న్

విమాన ప్రయాణికులనే కాదు..పైలట్లను కూడా కరోనా పాజిటివ్ కేసులు వణికిస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా పైలట్ ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలటంతో విమానాన్ని మధ్యలో నుంచే వెనక్కి రప్పించారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో విమానం వందే భారత్ మిషన్ లో భాగంగా మాస్కోకు బయలుదేరి వెళ్లింది. కానీ మధ్యలోనే అంటే ఉజ్బెకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి చేరిన సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన గ్రౌండ్ టీమ్ పైలట్ కు కరోనా పాజిటివ్ ఉన్న విషయాన్ని గుర్తించింది. వెంటనే సమాచారాన్ని చేరవేసి విమానాన్ని ఆకస్మికంగా వెనక్కి రప్పించారు.

అధికారులు పాజిటివ్ రిపోర్టు ను తొలుత నెగిటివ్ గా భావించటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అధికారుల ఆదేశాల మేరకు ఆ ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. అందరూ వెంటనే ఊపిరిపీల్చుకుని సిబ్బంది అందరినీ నిబంధనల ప్రకారం క్వారంటైన్ కు పంపారు. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయిన తర్వాత పలువురు విమాన ప్రయాణికులు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. మాస్కోలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి రప్పించేందుకు మరో విమానాన్ని పంపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it