కరోనా దెబ్బకు ఎయిర్ లైన్స్ సీట్లలో మార్పులు!

కరోనా దెబ్బకు ఎయిర్ లైన్స్ సీట్లలో మార్పులు!

పర్యాటక రంగంపై కరోనా వైరస్ కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఈ దెబ్బకు కకావికలం అయిన వాటిలో విమానయాన రంగం కూడా ఒకటి. కరోనా ఎఫెక్ట్ తర్వాత సురక్షిత ప్రయాణం ఎలా? అన్న చర్చ మొదలైంది. కొన్ని విమానాశ్రయాలు అయితే ఎప్పుడు సర్వీసులు ప్రారంభం అయినా ప్రయాణికులు చాలా ముందుగా విమానాశ్రయాలకు చేరుకోవాలి. మాస్క్ లు , చేతులకు గ్లోవ్స్ తప్పనిసరి అని చెబుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా రాబోయే రోజుల్లో ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వైరస్ ల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు విమానాల్లో సీట్లను మార్చాల్సిన అవసరం ఉందని..ఓ ఇటాలియన్ కంపెనీ కొత్త డిజైన్లను తెచ్చి చర్చకు తెరలేపింది. ఇటలీకి చెందిన ఏవియో ఇంటీరియర్స్ పలు డిజైన్లతో కూడిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ కాన్సెప్ట్ విమాన ప్రయాణికుల మధ్య భౌతిక దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు రకరకాల మోడల్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న సీటింగ్ ప్రకారం అందరి సీట్లు ఒకే వైపు ఉంటాయి. మూడు సీట్ల వరసలో ఓ సీటు మాత్రం 180 డిగ్రీల మేర విమానం వెనక వైపుకు తిరిగి ఉంటుంది. రెండవ డిజైన్ లో పాత సీట్లు అలాగే ఉంచి ప్రతి సీటు మధ్యలో గ్లాస్ సేఫ్ పెట్టనున్నారు.

ఇది ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోక కుండా చేస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ ఆరోగ్య సంస్థల సిఫారసుల ప్రకారం ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు అందించాల్సి ఉంటుందని ఏవియోఇంటీరియర్స్ చెబుతోంది. ఈ నూతన డిజైన్లపై ఓ ప్రముఖ ఎయిర్ లైన్ ఆసక్తి చూపినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికాలోని పలు ఎయిర్ లైన్స్ ఇప్పటికే ప్రయాణికులతో ఫ్లైట్ అటెండెంట్ మాట్లాడాల్సిన అవసరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో మధ్య సీటును వదిలేసి..ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా ఏర్పాట్లు ప్రారంభించింది. డెల్టా ఎయిర్ లైన్స్ దేశీయ విమానాల్లో విమాన సిబ్బందికి, ప్రయాణికుల మధ్య సంబంధం లేకుండా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా స్నాక్స్ బ్యాగ్ తోపాటు ప్రయాణికులకు కావాల్సిన అన్ని అవసరాలు ముందే సీట్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it