అమీన్ పీర్ దర్గా

అమీన్ పీర్ దర్గా

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా.అన్ని మతాల ప్రజలూ సందర్శించే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ దర్గా అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది.పర్యాటకులు, అలాగే స్థానికులు దర్గాకు విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని, అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి వస్తారు.ఈ దర్గాలో సాధువుల సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థించడం ద్వారా కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం.

ఈ ఇద్దరు సాధువుల వారసులు కూడా ఈ మందిరంలో పని చేస్తున్నారు. వేరే సిబ్బంది నుండి వీరిని గుర్తించేందుకు కాషాయ దుస్తులు ధరిస్తారు. వీరు కాషాయ రంగు టోపీలనే ఈ ఇద్దరు సాధువుల భక్తులు ధరిస్తారు. ప్రవక్త మహమ్మద్ వారసుడు పీరుల్లా హుస్సైని అని ఎక్కువ మంది నమ్మకం. దేశంలోని అన్ని సూఫీ సాధువుల దర్గాలని సందర్శించే ఆయన అజ్మీరు విన్నపం మేరకు కడపలో స్థిరపడ్డారు.

Similar Posts

Recent Posts

International

Share it