పాక్ ఎయిర్ లైన్స్ కు అమెరికా షాక్

పాక్ ఎయిర్ లైన్స్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ కు చెందిన ఎయిర్ లైన్స్ కు అమెరికా షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన చార్టర్ విమానాలను అమెరికాలోకి అనుమతించమని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రకటించింది. దీనికి కారణం పాకిస్థాన్ స్వయంగా తమ దేశంలో చాలా మంది ఫేక్ ఢిగ్రీలతో పరీక్షలు రాయటంతో..పైలట్ పరీక్షలను కూడా వేరే వాళ్లతో రాయించి పైలట్లుగా ఉద్యోగాలు పొందినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది.

ఫేక్ లైసెన్స్ లతో ఏకంగా విమానాలు నడుపుతున్న వారిని గుర్తించి పాక్ ఎయిర్ లైన్స్ చర్యలు ప్రారంభించింది. అయినా సరే పలు దేశాలు పాక్ ఎయిర్ లైన్స్ అంటే హడలిపోతున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ పీఐఏ విమానాలకు నో చెప్పింది. ఇప్పుడు అమెరికా కూడా అదే బాటలో నడిచింది. పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో మే 22న పీఐఏ జెట్‌ విమానం కూలడంతో 97 మంది మరణించారు.

Similar Posts

Recent Posts

International

Share it