బాసర

Update: 2019-04-14 12:55 GMT

భారతదేశంలో ఉన్న రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కశ్మీర్‌లో ఉండగా, రెండవది బాసరలో ఉంది.బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి.పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమ వేడుక జరుపుతారు. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్ష ఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో భక్తిభావం వెల్లివిరుస్తుంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాస లింగం ఉన్నాయి.

మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ"వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒకో పక్క ఒకో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు -ఇంద్రతీర్థం, సూర్యతీర్థం,వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.

నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం బాసర. నిజామాబాద్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది.హైదరాబాద్ నుంచి 211 కి.మీ. దూరం.

సందర్శన సమయం: ఉదయం 4.00 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ

 

Similar News