ఏటూరునాగారం అభయారణ్యం

Update: 2019-02-14 15:14 GMT

రోడ్డు మార్గంలో అడవి నుంచి ఏటూరునాగారం అభయారణ్యానికి వెళుతుంటే కలిగే అనుభూతే అద్భుతం. రహదారుల కు ఇరువైపులా దట్టమైన..పొడవాటి చెట్లు. పచ్చదనం దుప్పటి కప్పుకున్న ప్రాంతం అది.ఏటూరునాగారం అభయారణ్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది.ఈ అభయారణ్యం 806 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం రకరకాల వృక్ష, జంతుజాల సంరక్షణాకేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ వెదురు, మద్ది, చిరుమాను, సారపప్పు చెట్టు మున్నగువాటితో కూడిన ఆకురాల్చు పొడి టేకు వంటి వృక్షజాలం ఉంది. అడవిలో పెద్దపులి,చిరుతపులి, అడవిదున్న, కడితి, దుప్పి, మనుబోతు, కృష్ణ జింక,నాలుగు కొమ్ముల జింక, మొరుగు జింక, అడవి పంది, తోడేలు, నక్క,గుంటనక్క, అడవిపిల్లి అనేక రకాల పక్షులు ఉన్నాయి. గోదావరి తీరం వెంట విస్తరించి ఉంటుంది ఈ అభయారణ్యం. దేశంలోని అతి ప్రాచీన అభయారణ్యాల్లో ఇది ఒకటి.

హైదరాబాద్ నుంచి 256 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ నుంచి అయితే 112 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అక్టోబర్-–ఏప్రిల్ మధ్య కాలం ఈ ప్రాంతం సందర్శనకు అనువైన సమయం.

 

Similar News

చార్మినార్