కొల్లాపూర్

Update: 2019-04-06 14:41 GMT

మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ మాధవస్వామి దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. క్రీ శ 16వ శతాబ్దంలో జెట్ ప్రోలు రాజ సంతతి కృష్ణా నది ఎడమ తీరాన మంచాలకట్టలో ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఈ దేవాలయ నిర్మాణ శైలి వైవిధ్యం. దేవాలయ ప్రాకారాలపై శ్రీ మహా విష్ణువు దశావతారాలు చిత్రీకరించి ఉంటాయి. దేవాలయంలోని మండపం, గరుడాలయాలను మోసే స్థంభాలు దేవాలయానికి ఒక వైవిధ్యమైన శైలిని ప్రస్పుటిస్తున్నాయి. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం జరిగే సమయంలో నదీ జలాలలో మునకకు గురికాకుండా ఈ దేవాలయాన్ని కొల్లాపూర్ లో పున:ప్రతిష్టించారు.

హైదరాబాద్ నుంచి 238 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

దర్శనం వేళలు: ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకూ

Similar News