మూడు రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది

Update: 2020-11-26 05:52 GMT

పర్యాటకులకు 2020 సంవత్సరం చేదు అనుభవాలను మిగిల్చిన కాలంగా మారుతుంది. కొన్ని నెలల పాటు ప్రపంచం అంతా ఎక్కడికి అక్కడే ఆగిపోయింది. కానీ ఆమె మాత్రం ఓ సాహసం చేసింది. ఏకంగా మూడు రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రతి ఖండాన్ని టచ్ చేసింది. ఈ ఘనత సాధించింది యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ)కి చెందిన డాక్టర్ కావ్లా అల్ రమతి. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టేసి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. 86.46 గంటల వ్యవధిలో ఆమె ప్రపంచంలోని ఏడు ఖండాలను చుట్టేసింది.

అయితే ఈ ప్రయాణానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని..గంటల తరబడి విమాన ప్రయాణం ఎన్నో చుక్కలు చూపించిందని, దీనికి ఎంతో సహనం కావాలన్నారు. ఆమె ఈ సమయంలో ఏకంగా 208 దేశాలను కవర్ చేస్తూ ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ రికార్డ్స్ ను అందుకుంది. ఆమె చివరగా తన పర్యటనను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ముగించారు. ఆమె తాను అందుకున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు చెందిన సర్టిపికెట్ తో కూడిన ఫోటోను కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆయా దేశాల్లో ఉన్న సంస్కృతులు, పద్దతులను తెలుసుకునేందుకే తాను ఈ పర్యటన చేపట్టినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News