పర్యాటకులకు మాల్దీవుల వినూత్న ఆఫర్

Update: 2020-10-01 10:20 GMT

పర్యటన పర్యటనకు పాయింట్స్. ఎన్ని రోజులు ఉంటే అన్ని పాయింట్స్. ఉండే రోజులను బట్టి పాయింట్స్ కూడా మారతాయి. ప్రపంచంలోనే ఇలా పర్యాటకులకు ప్రత్యేక లాయల్టీ పాయింట్స్ ఇస్తున్న తొలి దేశంగా మాల్దీవులు రికార్డులకు ఎక్కబోతోంది. ఈ పాయింట్స్ ఆధారంగా పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు..వసతులు కల్పించనున్నారు. ఈ పాయింట్స్ కు ‘మాల్దీవుల బోర్డర్ పాయింట్స్’ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. మూడంచెల విధానంలో దీన్ని అమలు చేయనున్నారు. ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించుకునే కార్యక్రమాల కోసం వచ్చే వారికి అదనపు పాయంట్స్ ఇవ్వనున్నారు. మాల్దీవుల బోర్డర్స్ పాయింట్స్ కేటాయింపునకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విభాగాలుగా ప్రకటించారు.

కోవిడ్ కారణంగా తగ్గిపోయిన పర్యాటకులను ఆకట్టుకునేందుకు మాల్దీవులు ఈ కొత్త కార్యక్రమం తలపెట్టింది. ద్వీపదేశం అయిన మాల్దీవులకు పర్యాటకమే ప్రధాన వనరు అన్న సంగతి తెలిసిందే. జులైలోనే మాల్దీవులు పర్యాటకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా కల్పించిన విషయం తెలిసిందే. మాల్దీవులు వెళ్ళే పర్యాటకులకు ఎలాంటి క్వారంటైన్ కూడా లేదు. ఇప్పటివరకూ మాల్దీవుల్లో మొత్తం 10291 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకూ 34 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం మాల్దీవుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య1142 మాత్రమే ఉంది.

https://www.youtube.com/watch?v=mt52NaJq08A

Similar News