మంజీరా అభయారణ్యం

Update: 2019-04-13 12:23 GMT

మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ‘మంజీరా అభయారణ్యం’ ఒకటి.సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజీ దగ్గర మంచినీటి మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉంటుంది. వలస పక్షులకు కూడా ఇది విడిది కేంద్రంగా ఉంది. రష్యా, నైజీరియా తదితర దేశాలకు చెందిన పలు పక్షులు ప్రత్యుత్పత్తి కోసం ఈ అభయారణ్యానికి వస్తాయి. మంజీరా నదిలోని ద్వీపాల్లోని చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకుని నెలలపాటు ఇక్కడే ఉండే పక్షులు తర్వాత తమ స్వస్థలాలకు తిరిగి వెళతాయి.

హైదరాబాద్ నుంచి 66 కిలోమీటర్ల దూరం.సందర్శనకు అనువైన సమయం నవంబర్ – -జనవరి

Similar News