మక్కా మసీద్

Update: 2019-04-18 07:04 GMT

భారతదేశంలోని ప్రాచీన, పెద్దవైన మసీదుల్లో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మసీద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది 1694లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పూర్తి చేశాడు. మసీదు నిర్మాణం కోసం 8000 మంది పనిచేశారు. నిర్మాణానికి 77 సంవత్సరాలు పట్టింది. చార్మినారుకు నైరుతి దిశలో100గజాల దూరంలోవున్న ఈ మసీదు నిర్మాణం కొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు.వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మసీద్ గా స్థిరపడిందని చెబుతారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగి ఉంది. ఈ మసీద్‌లో మహమ్మదు ప్రవక్త "పవిత్ర కేశం" భద్రపరచబడి ఉంది. నైజాం రాజుల, వారి కుటుంబికుల సమాధులు కూడా ఈ స్థలంలోనే ఉన్నాయి.

సందర్శన వేళలు: ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకూ

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకూ)

 

Similar News

చార్మినార్