నిజామాబాద్ కోట

Update: 2019-04-14 06:34 GMT

నిజామాబాద్ కోటను 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు.ఇది నిజామాబాద్ పట్టణానికి నైరుతి దిశలో, మహాత్మా గాంధీ చౌక్ నుండి2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోట పైన ఉన్న ఆలయాన్ని రఘునాథ ఆలయం (జగన్నాథ్ ఆలయం, రామాలయం ఖిల్లా) అని పిలుస్తారు.ఇక్కడికి హిందూ భక్తులు వస్తారు. పర్యాటక కేంద్రంగా కూడా ఉంది. ఛత్రపతి శివాజీ తన గురువైన రాందాస్ ఆజ్ఞపై ఈ శ్రీరామ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. విశాలమైన మందిరాలతో ఉన్న ఈ ఆలయాన్ని 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఎల్లప్పుడూ చల్లగా ఉండేందుకు తగు విధంగా నిర్మించారు. ఆలయంలో 53 అడుగుల ఎత్తులో ఒక స్తంభం ఉంది. ప్రతిరోజు దీపం వెలిగించడానికి ఈ స్తంభాన్ని ఉపయోగిస్తారు.

ఈ దీపం చూసిన తర్వాతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు వారివారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారట. నిజామాబాద్ కోటను 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఖిల్జీ వంశానికి చెందిన రెండవ పాలకుడు అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ (1296నుండి 1316) 1311లో ఈ కోటను ఆక్రమించాడు. ఆ తరువాత దీనిని కుతుబ్ షా స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ నిజాం అసఫ్ జాహీ కోటను పునర్నిర్మించాడు. ఈ కోట పెద్ద ప్రాంతంలో ముస్లిం మతం ఆకృతిని పోలి, చుట్టూ రాతి గోడలతో ఉంటుంది. ఇందులో ఒక మసీదు, ఒక పాఠశాల, అసఫ్ జాహీ కాలం నాటి జైలు ఉంది. పైన ఒక ఆలయం ఉంది.

 

Similar News

రఘునాథాలయం