పైగా సమాధులు

Update: 2019-04-18 09:07 GMT

సుప్రసిద్ధమైన ‘జాలి’ పనితనంతో సునిశితంగా చెక్కిన మొజాయిక్ పలకలతో నిర్మించిన ఈ సమాధులు ఓ అద్భుతం. 18వ శతాబ్దానికి చెందిన పైగా సమాధులు సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి.పాలరాతితో జఠిలమైన ఇండో సోర్సెనిక్ శైలితో నిర్మించిన ఈ సమాధులు విదేశీ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నిజాం రాజులకు తీవ్ర విధేయులుగా ఉంటూ, వారి వద్ద రాజ్యతంత్ర నిపుణులుగా, సేనా నా యకులుగా పనిచేసిన పైగా వంశానికి చెందిన సమాధులు ఇవి. పైగాల సమాధులు హైదరాబాద్ నగరంలో చార్మినార్‌కు ఆగ్నేయంగా 4 కిలోమీటర్ల దూరంలోని పిసల్ బండ ప్రాంతంలో ఒవైసీ ఆసుపత్రి పక్క నుంచి సంతోష్ నగర్ వెళ్ళే చిన్న దారిలో నెలకొన్నాయి. సున్నం, మోర్టార్లతో నిర్మించి అందంగా పాలరాయి అమర్చి చెక్కి తయారుచేశారు. పలు తరాలకు చెందిన పైగా ప్రభువంశీకులను ఇక్కడ సమాధి చేశారు.

సందర్శన: వేళలు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం ౫ గంటల వరకూ

శుక్రవారం: సెలవు

 

Similar News

చార్మినార్