సారంగాపూర్ హనుమాన్ ఆలయం

Update: 2019-04-14 06:45 GMT

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ హనుమాన్ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ కాలంలో సమర్థ రామదాసు నిర్మించినట్లు చెబుతారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ వర్షాల కోసం రామదాసు తపస్సు చేశాడని..ఆ స్థలంలోనే గుడికట్టాడని చారిత్రక సమాచారం.

ఈ ఆలయాన్ని భక్తులు చాలా మహిమాన్వితంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో పర్యాటకుల కోసం ఉద్యానవనాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు అనువైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి అక్కడ. హైదరాబాద్ నుంచి బాసర వెళ్లే మార్గంలోనే ఈ దేవాలయం ఉంది.

 

Similar News

రఘునాథాలయం