ఆగస్టు 1 నుంచి ఏపీలో పర్యాటకులకు అనుమతి

ఆగస్టు 1 నుంచి ఏపీలో పర్యాటకులకు అనుమతి

రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ సందర్శకులను అనుమతించటానికి రంగం సిద్ధం అయింది. ఆగస్టు 1 నుంచి ఏపీ అంతటా పర్యాటక రంగాన్ని తిరిగి ఓపెన్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు ఉంటాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా పర్యాటక రంగం పూర్తిగా పడకేసిన విషయం తెలిసిందే. దీని వల్ల సర్కారుకు అరవై కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆయన వెల్లడించారు.

కొత్తగా ఏపీలో పలు స్టార్ హోటళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య విధానంలో ఏడు చోట్ల ఈ స్టార్ హోటళ్లు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలోకి ఇతర రాష్ట్రాల వారు ప్రవేశించటానికి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మరి ఆగస్టు 1 నాటికి వీటిని ఎత్తేస్తారా? లేదా అన్నది పర్యాటక శాఖ విడుదల చేయనున్న ప్రామాణిక నిర్వహణ విధానాలు(ఎస్ వోపీ) విడుదల అయితే కానీ తెలియదు.

Similar Posts

Recent Posts

International

Share it