హైదరాబాద్ కు కొత్త అందాలు

హైదరాబాద్ కు కొత్త అందాలు

భాగ్యనగరం శిగలో మరో మణిహారం. ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనతో హైదరాబాద్ కు కొత్త అందాలు వచ్చాయి. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవటమే కాకుండా నగరంలోని ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కల్పించనుంది. సెప్టెంబర్ 25 సాయంత్రం నుంచి ప్రయాణికులకు ఈ కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. ఇకపై ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అత్యంత కీలక ప్రదేశంగా రూపాంతరం చెందనుంది.

ఈ తీగల వంతెనకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెనలో ప్రపంచంలోనే అతి పొడవైన 233.85 మీటర్ల ప్రీకాస్ట్‌ సెగ్మంటల్‌ స్పాన్‌ ఉంది. 184 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇది ఆసియాలో రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని శుక్రవారం నాడు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ప్రారంభించగా..ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎన్నో సంక్లిష్టతలతో కూడిన ఈ బ్రిడ్జిని ఎల్ అండ్ టి నిర్మించింది.

Similar Posts

Recent Posts

International

Share it