నలుగురి కోసం 180 సీట్ల విమానం

నలుగురి కోసం 180 సీట్ల విమానం

డబ్బున్న పారిశ్రామికవేత్తలు..సెలబ్రిటీలు తమ అవసరాల కోసం ప్రైవేట్ జెట్స్ బుక్ చేసుకుంటారు. ఇది చాలా కామన్. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే భోపాల్ కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తన కుటుంబ సభ్యుల కోసం ఏకంగా 180 సీట్ల సామర్ధ్యం గల ఏ320 విమానాన్ని బుక్ చేశారు. తీరా అందులో ప్రయాణించింది కేవలం నలుగురు మాత్రమే. రెగ్యులర్ విమానాల్లో అయితే చాలా మంది ప్రయాణికులు ఉంటారు..మరో వైపు కరోనా టెన్షన్. ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఆయన ఈ ప్ర్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు. ఈ విమానం భోపాల్ నుంచి బయలుదేరి న్యూఢిల్లీ వెళ్లింది.

ఇందులో సదరు బడా లిక్కర్ వ్యాపారికి చెందిన కుమార్తె, ఇద్దరు పిల్లతోపాటు పని మనిషి ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వీరు గత కొన్ని నెలలుగా భోపాల్ లో చిక్కుకుపోయారు. తాజాగా దేశంలో విమాన సర్వీసులు ప్రారంభం కావటంతో ఆయన ఏకంగా ఏ 320 విమానాన్ని బుక్ చేసి వాళ్లను పంపారు. ఈ విమానం కేవలం సిబ్బందితోనే భోపాల్ రాజాబోజ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని..ఈ నలుగురిని ఎక్కించుకుని బయలుదేరింది. ఎయిర్ 320 అద్దెకు తీసుకోవటానికి సుమారు 20 లక్షల రూపాయల వ్యయం అవుతుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it