బిర్లా మందిర్

బిర్లా మందిర్

వేంకటేశ్వరస్వామి శేషాచలం ఏడు కొండలపై కొలువై ఉండగా అన్ని కొండలు కాకపోయినా ఓ కొండపై కొలువై ఉన్న వైనం హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తుంది. పాల నురుగులాంటి తెల్లని చలువ రాళ్లతో నిర్మితమై, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆ ఆలయం బిర్లామందిర్. ఈ ప్రాంతాన్ని నౌబత్ పహడ్ అని పిలుస్తారు. అయితే నౌబత్ పహడ్ అంటే ఎవరూ ఠకీమని చెప్పలేరు. బిర్లా మందిర్ అంటే చాలు..వెంటనే అడ్రస్ చెప్పేస్తారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని అత్యంత ముఖ్యమైన ప్రాంతంలో ఈ దేవాలయం ఉంటుంది.ఇది పూర్తిగా పాలరాతితో నిర్మితమైంది. రాజస్థాన్ నుంచి తెల్ల చలువరాతి రాళ్లు తెప్పించి ఈ నిర్మాణం చేశారు.

ఈ మందిరం హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. దేవాలయానికి ఆనుకునే బిర్లా సైన్స్ సిటీ, ప్లానిటోరియం కూడా ఉంటాయి. నిత్యం ఈ ప్రాంతానికి వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. బిర్లా మందిర్ లోపలే కార్లతోపాటు..ద్విచక్ర వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. బిర్లా మందిర్ పై నుంచి చూస్తే తెలంగాణ పరిపాలనా కేంద్రం అయిన సచివాలయంతోపాటు.. దగ్గరగా హుస్సేస్ సాగర్, బుద్ద విగ్రహం సందర్శకులకు కనువిందు చేస్తాయి. 1976లో బిర్లా మందిర్ ను ప్రారంభించారు. 13 ఎకరాల్లో ఈ దేవాలయం విస్తరించి ఉంటుంది. రామకృష్ణ మిషన్ ఈ ఆలయాన్ని నిర్మించింది.

సందర్శన వేళలు: ఉదయం 7 గంటల నుంచి 12.00 గంటల వరకూ

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ. Phone: 040 2345 0165

Similar Posts

Recent Posts

International

Share it