బిర్లా ప్లానిటోరియం

బిర్లా ప్లానిటోరియం

బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్‌లో ఉన్న ఖగోళ సందర్శన శాల. హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలో ఉన్న ఈ ఖగోళశాలను 8 సెప్టెంబర్, 1985న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారంభించారు. ఇదే పేరుతో ఖగోళ శాలలు కోల్‌కత, చెన్నైలలో కూడా న్నాయి. ఆకాశం, నక్షత్రాలు, రోదసి, గ్రహణాలు మొదలగు వాటి గురించి ఈ ఖగోళ శాలలో వివిధ భాషలలో వివరిస్తూ చూపించే దృశ్యాలు నిజంగా ఆకాశంలో కనిపించే దృశ్యాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడు సందర్శకులు నిజంగా ఆకాశంలో విహరిస్తున్నట్లు భ్రాంతి కలగడం దీని ప్రత్యేకత. దాదాపు35 నిమిషాల పాటు జరిగే సందర్శన ప్రతిరోజు తెలుగులో 4 సార్లు, ఆంగ్లంలో 3 సార్లు, హిందీలో ఒకసారి ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమమైన సైన్స్ సంస్థల్లో ఇది ఒకటి. విశ్వంలోని రహస్యాలను వెల్లడించే ప్లానిటోరియంతో సందర్శకులు ఓ పరిపూర్ణమైన అనుభూతిని పొందుతారు.

సందర్శన వేళలు: ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it