బాలీవుడ్ పార్క్స్ , దుబాయ్

బాలీవుడ్ పార్క్స్ , దుబాయ్

యాక్షన్. అడ్వెంజర్. రొమాన్స్, కామెడీ, మ్యూజిక్. ఇలా సినిమాలో ఉండే హంగామాలు అన్నీ కూడా ఈ దుబాయ్ బాలీవుడ్ పార్క్స్ లో ఉంటాయి. అసలు దుబాయ్ లో బాలీవుడ్ పార్క్స్ ఏంటి అనుకుంటున్నారా?. ఓ విదేశీ గడ్డపై పూర్తిగా బాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన విశేషాలతో నిర్మించిన బాలీవుడ్ పార్క్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దుబాయ్ సందర్శనకు వెళ్లిన వారు చూడాల్సిన ప్రాంతాల్లో బాలీవుడ్ పార్క్స్ ఒకటి. ఈ బాలీవుడ్ పార్క్ కు ఆనుకునే మరెన్నో టూరిస్ట్ స్పాట్స్.

దుబాయ్ లో బాలీవుడ్ కు అంకితం చేసిన థీమ్ పార్క్ ఇది. ఈ పార్కులో క్రిష్ ప్రత్యేక షో...షోలే కు సంబంధించిన షోలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతే కాదు..సాయంత్రం వేళల్లో భారతీయ భాషలకు సంబంధించిన పలు చిత్రాలకు చెందిన పాటలతో ఇదే బాలీవుడ్ పార్క్ లో డ్యాన్స్ లు కూడా ఉంటాయి. విచిత్రం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో కళలు అంతరించిపోతుంటే దుబాయ్ బాలీవుడ్ పార్క్స్ లోని పలు ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ పలు బాలీవుడ్ చిత్రాల షూటింగ్స్ కూడా జరుగుతాయి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ థీమ్ పార్క్ ఇది.

https://www.youtube.com/watch?v=AE6i1BRK8DA

Similar Posts

Share it