బుద్ధవనం శ్రీపర్వతం

బుద్ధవనం శ్రీపర్వతం

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ‘థీమ్ పార్కు’ ఇది. 279 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇది సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఉద్యానవనంలో బుద్ధుని వారసత్వ చిత్రాలు తెలంగాణ అవశేషాలను భధ్రపర్చారు. అమరావతి స్థూపం యొక్క ప్రతిరూపం అదే ప్రమాణంలో ఇక్కడ కనిపిస్తుంది. ఇసుకరాయిలో చెక్కి,పలకలతో పొదిగిన ఈ స్థూపం అతి సుందరంగా ఉంటుంది.సున్నపురాయిలో చెక్కిన బుద్ధభగవానుడి జీవిత ఘట్టాలు చూపరులకు ఎంతో కుతూహలాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రంగు రంగుల పూలమొక్కలతో, పచ్చని పరిసరాలతో కూడిన ఈ ప్రాంతం పర్యాటకులు సేద తీరేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన బుద్ధ ఎక్స్ ప్రెస్ అనే బొమ్మల రైలుపై ప్రయాణిస్తూ ఈ పరిసరాలను వీక్షించొచ్చు.

హైదరాబాద్ కు 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నల్గొండకు48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it