బుర్జ్ అల్ అరబ్ జుమేరా

బుర్జ్ అల్ అరబ్ జుమేరా

కృత్రిమంగా సృష్టించిన ద్వీపంలో నిర్మించిన విలాసవంతమైన హోటలే బుర్జ్ అల్ అరబ్. ప్రపంచంలోనే ఇది ఐదవ అత్యంత ఎత్తైన హోటల్ గా నిలుస్తుంది. చుట్టూ సముద్రం..హోటల్ ముందు అతి పెద్ద బీచ్. హోటల్ కు వచ్చే అతిధుల కోసం ఓ ప్రైవేట్ బీచ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే అది సాదాసీదా హోటల్ కానట్లే లెక్క. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన..ఖరీదైన హోటల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ హోటల్ లో రూమ్ బుక్ చేసుకుంటే పికప్ కు రోల్స్ రాయిస్ కారు వస్తుందంటే ఈ హోటల్ రేంజ్ ఏంటో ఓ సారి ఊహించుకోండి.

ఆతిధ్యంలో అద్భుతాలు చూపించే ఈ హోటల్ కు చాలా ప్రత్యేకతలు..విశిష్టతలు ఉన్నాయి. ఎన్నో సార్లు ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటల్ గా బుర్జ్ అల్ అరబ్ జమేరా నిలిచింది. ఈ హోటల్ లో 201 విలాసవంతమైన డూప్లెక్స్ సూట్స్ ఉన్నాయి. ఇక్కడ తక్కువలో తక్కువ అంటే ఒక్క రోజు రూమ్ కోసం 85 వేల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటక సీజన్ లో అయితే ఇది లక్ష రూపాయలకు చేరుతుంది. అంతే కాదు..హోటల్ చివరి భాగంలో హెలికాఫ్టర్లు దిగేందుకు వీలుగా హెలీప్యాడ్ కూడా ఉంటుంది.

బుర్జ్ అల్ అరబ్ హోటల్ వీక్షించేందుకు కింద వీడియో క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=ZIu17sC22HE

Similar Posts

Share it