విమానాల్లో కేబిన్ లగేజీకి నో

విమానాల్లో కేబిన్ లగేజీకి నో

కరోనా ఎఫెక్ట్ తో ఆగిన దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రయాణికుల కోసం పౌరవిమానయాన శాఖ ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ వోపీ) ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం తొలి దశలో ప్రారంభించే విమాన సర్వీసుల్లో కేబిన్ బ్యాగేజ్ ను అనుమతించరు. కేవలం 20 కిలోల లోపు బరువు ఉన్న చెక్ ఇన్ బ్యాగేజ్ మాత్రమే అనుమతించనున్నారు. దీంతోపాటు అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని తొలి దశలో ప్రారంభించే విమానాల్లో అనుమతించకూడదని ఎస్ వోపీలో పేర్కొన్నారు. వీటిపై పౌరవిమానయాన శాఖ విమాయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకుల వంటి భాగస్వాములు అందరి నుంచి అభిప్రాయాలను కోరింది. దీంతో విమానాల్లో భౌతిక దూరం పాటించేలా మూడు సీట్లు ఉన్న వరసల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలని ప్రతిపాదించారు. ప్రయాణికులు విధిగా ఇంట్లోనే వెబ్ చెక్ ఇన్ అయి విమానాశ్రయానికి రావాల్సి ఉంటుంది.

ప్రయాణికుల రిపోర్టింగ్ సమయాన్ని రెండు గంటలకు పెంచాలని ప్రతిదించారు. ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ కూడా తప్పనిసరి చేశారు. తనిఖీ సమయాల్లో ప్రయాణికులను చేతులతో తనిఖీ చేసే పద్దతికి కూడా స్వస్తి చెప్పనున్నారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏదైనా శబ్దం చేస్తే తప్ప..చేతితో తనిఖీ చేసే పద్దతికి బ్రేక్ ఇవ్వనున్నారు. అంతే కాదు..తొలి దశలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ప్రయాణికుల బోర్డింగ్ పాస్ పై ముద్ర కూడా వేయవద్దని సూచించారు. విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయంతోపాటు బోర్డింగ్ గేటు దగ్గర కూడా ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. విమానంలో చివరి మూడు వరసలు ఖాళీగా ఉంచనున్నారు. ఎవరికైనా ఇబ్బంది అన్పిస్తే అలాంటి వారిని విమానంలోని సిబ్బంది పీపీఈ కిట్స్ ధరించి పర్యవేక్షిస్తారని ప్రతిపాదించారు.

Similar Posts

Recent Posts

International

Share it