చెక్ ఇన్ బ్యాగేజ్ ఇక ఎయిర్ లైన్స్ ఇష్టప్రకారమే

చెక్ ఇన్ బ్యాగేజ్ ఇక ఎయిర్ లైన్స్ ఇష్టప్రకారమే

లాక్ డౌన్ అనంతరం దేశంలో విమాన సర్వీసులు ప్రారంభం అయిన తర్వాత పలు ఆంక్షలు పెట్టారు. విమాన ఛార్జీలపై కూడా పరిమితులు విధించిన పౌరవిమానయాన శాఖ లగేజ్ కు సంబంధించి కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఒక్కో దేశీయ ప్రయాణికుడికి ఒక చెక్ ఇన్ బ్యాగేజ్ మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. అయితే ఇఫ్పుడు పౌరవిమానయాన శాఖ ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. ఎయిర్ లైన్స్ తమ విధానాల ప్రకారమే చెక్ ఇన్ బ్యాగేజ్ ల సంఖ్యను నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నాడు ఓ సర్కులర్ ను విడుదల చేశారు. దీంతో ఇక దేశీయ ఎయిర్ లైన్స్ ఒక్కో ప్రయాణికుడికి ఎన్ని చెక్ ఇన్ బ్యాగ్ లను అనుమతించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు లభించనుంది.

ఇప్పుడిప్పుడే దేశీయ విమానయాన రంగం గాడిన పడుతోంది.ఎయిర్ బబుల్ కింద పలు అంతర్జాతీయ రూట్లలో కూడా సర్వీసులు ప్రారంభం కావటంతో ఒక్క చెక్ ఇన్ బ్యాగేజ్ మాత్రమే అనుమతించటం వల్ల కనెక్టింగ్ ఫైట్లతో విదేశాలకు వెళ్ళే వారికి చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు ఆయా ఎయిర్ లైన్స్ నిర్ణయానికి చెక్ ఇన్ బ్యాగేజ్ పై ఆంక్షలను సడలిస్తూ నిర్ణయాలను ఎయిర్ లైన్స్ కు వదిలేశారు. ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట కల్పించే అంశమే.

Similar Posts

Recent Posts

International

Share it