తొలి రోజు ఫ్లైట్ రాడార్ చిత్రాలు చూడండి

తొలి రోజు ఫ్లైట్ రాడార్ చిత్రాలు చూడండి

భారత గగనతలంలో విమానాల ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసా?. ఇదిగో చూడండి అంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కొన్ని ఫోటోలు విడుదల చేశారు. రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావటంతో పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తోంది. అందుకే ఆయన ఎంతో ఆనందంగా ఫ్లైట్ రాడార్ 24 చిత్రాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు.

దేశంలో తొలి రోజు ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. అందమైన లైవ్ చిత్రాల క్యాప్చర్ చేసింది ఇదిగో అంటూ ఫోటోలు విడుదల చేశారు. భారతీయులు మరోసారి ఎగరటం ప్రారంభించారు అంటూ ఆయన పేర్కొన్నారు. దేశీయ విమానయాన సర్వీసులు ప్రారంభం కావటంతో ఆకాశం ఎలా బిజీగా ఉందో చూడండి అని మంత్రి పేర్కొన్నారు. తొలి రోజు ప్రయాణికుల లేక పలు సర్వీసులు కూడా రద్దు అయ్యాయి.

Similar Posts

Recent Posts

International

Share it