ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసు!

ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసు!

18 దేశాలు..20 వేల కిలోమీటర్లు..70 రోజులు

మే 2021లో తొలి ట్రిప్

ఆశ్చర్యంగా ఉన్నా నిజమే ఇది. ఓ కంపెనీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసింది. గురుగ్రామ్ కు చెందిన కంపెనీ వచ్చే ఏడాది మే నుంచి ఈ సర్వీసును ప్రారంభించబోతోంది. ఈ డెబ్బయి రోజుల పర్యటనలో మొత్తం జర్నీ 20 వేల కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఏకంగా 18 దేశాలు కవర్ అవుతాయి. ఆయా దేశాలకు సంబంధించిన వీసాల వ్యవహారంతోపాటు ఈ డెబ్బయి రోజుల్లో 4స్టార్ లేదా 5 స్టార్ వసతి, భారతీయ వంటకాలతో కూడిన ఆహారం అందిస్తారు. అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ ‘బస్ టూ లండన్’ పేరుతో ఈ సర్వీసులు ప్రారంభించనుంది. ఈ టూర్ కు గాను కంపెనీ ఒక్కో వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయల మేర ఛార్జ్ చేయనుంది. ఈ టూర్ లో మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్జికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథూనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలు కవర్ కానున్నాయి. 20 సీట్లు మాత్రమే ఉండే ఈ ప్రత్యేక బస్సలో బిజినెస్ క్లాస్ సీట్లు కూడా ఉంటాయి.

ఈ పర్యటన కోసమే బస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ట్రిప్ ను నాలుగు కేటగిరీలుగా విభజించనున్నారు. పర్యాటకులు తమకు నచ్చిన క్యాటగిరిని ఎంపిక చేసుకుని దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పర్యటనలు అంటే ఎంతో ఆసక్తి ఉన్న తుషార్ అగర్వాల్, సంజయ్ మదన్ లు ఈ బస్సు ట్రిప్ ప్లాన్ చేశారు. వీరిద్దరూ 2017తోపాటు 2018, 2019లో రోడ్డు ట్రిప్ ద్వారా లండన్ వెళ్చొచ్చారు కూడా. చాలా మంది రోడ్డు మార్గం ద్వారా లండన్ వెళ్లటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని..అందుకే తాము ఈ ప్లాన్ చేశామని తుషార్ అగర్వాల్ చెప్పినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్నందున ఇంకా రిజిస్ట్రేషన్లు ప్రారంభించలేదని..కరోనా తగ్గుముఖం పట్టగానే ప్రారంభిస్తామని తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it