మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేశీయ విమాన సర్వీసులకు రంగం సిద్ధం అయింది. మే 25 నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మే 25 నుంచి సర్వీసులు ప్రారంభించటానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సేవలకు సంబంధించి అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ వోపీ) విడిగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వాస్తవానికి కొన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జూన్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభించాయని వార్తలు వెలువడిన తరుణంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ అందుకు భిన్నంగా మే 25 నుంచే సర్వీసులకు అనుమతి ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో త్వరలోనే ఆయా దేశాల్లో పరిస్థితులను మదింపు చేసి అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it