దుబాయ్ బీచ్ లు ఓపెన్

దుబాయ్ బీచ్ లు ఓపెన్

కరోనా ఆంక్షల తర్వాత దుబాయ్ మున్సిపాలిటీ నగరంలోని ప్రధాన బీచ్ లు, పార్కులను శుక్రవారం నుంచి ఓపెన్ చేశారు. నగరంలోని ప్రధాన బీచ్ లు అయిన జెబిఆర్, అల్ మమ్ జార్, జుమేరా, ఉమ్ సీక్వెమ్ లను ప్రారంభించారు. అదే సమయంలో మున్సిపాలిటీ పలు ఆంక్షలు కూడా విధించింది. కరోనా కారణంగా విధిగా అందరూ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

దుబాయ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ‘దుబాయ్ ప్రేమ్’ను కూడా మే 29 నుంచి ప్రారంభించారు. కరోనా ఆంక్షల తర్వాత ఈ ప్రముఖ ప్రాంతాల్లో ప్రజలను అనుమతించటం ఇదే మొదటిసారి. దుబాయ్ క్రమక్రమంగా పర్యాటకులను అనుమతించేందుకు రెడీ అవుతోంది. అయితే ఎప్పటి నుంచి ఏయే దేశాల ప్రయాణికులను అనుమతించాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Similar Posts

Share it