హైదరాబాద్ కు కొత్త అందాలు..హ్యాంగింగ్ బ్రిడ్జి

హైదరాబాద్ కు కొత్త అందాలు..హ్యాంగింగ్ బ్రిడ్జి

రాత్రి పూట ఆ ప్రదేశాన్ని చూస్తే అసలు మనం హైదరాబాద్ లోనే ఉన్నామా అనే తరహాలో ఉంటుంది ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఇప్పుడు మరో అందం జత అవుతోంది. దుర్గం చెరువు దగ్గర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హ్యాంగింగ్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. 184 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలవనుంది. హైదరాబాద్ లో ఇది ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వెలుగొందనుంది.

అంతే కాదు..దీని కారణంగా మాదాపూర్-జూబ్లిహిల్స్ ల మధ్య దూరం కూడా తగ్గనుంది. 754.38 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. కలర్ ఫుల్ లైట్లతో దీన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. ఇది ఇప్పుడు హైదరాబాద్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా..ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారనుంది. తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫోటోను విడుదల చేశారు.

Similar Posts

Recent Posts

International

Share it