దుర్గం చెరువు

దుర్గం చెరువు

నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇదిహైదరాబాద్‌ నగరంలో మాదాపూర్ , జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. నగరం సైబరాబాద్‌గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండేది. తర్వాత పలు రూపాంతరాలు చెందింది. తొలుత దుర్గం చెరువు కొద్దిమంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు,సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్లే దీనికి సీక్రెట్ లేక్ అనే పేరు ఉంది. ఇప్పటికీ తన సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది.ప్రస్తుతం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్నవరంలో ఉన్న తరహాలోనే హ్యాంగింగ్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఇది పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది.

Similar Posts

Share it