ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామమే ద్వారకా తిరుమల. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం.స్వయంభువుగా ప్రత్యక్షమైనవేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు. "పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కానీ చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.

ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనది. రెండవది స్వామిపై భాగం మాత్రమే కనిపించే అర్ధ విగ్రహం. ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు,ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం వెళ్ళడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరిటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్మటం-దారుకము వృత్తిగా కలవారు. దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.

Similar Posts

Recent Posts

International

Share it