సెప్టెంబర్ వరకూ ఎతిహాద్..ఎమిరేట్స్ వేతనాల కోత

సెప్టెంబర్ వరకూ ఎతిహాద్..ఎమిరేట్స్ వేతనాల కోత

కరోనా దెబ్బకు చిన్నా పెద్దా తేడా లేదు. అందరూ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోతలు విధిస్తున్నారు. ప్రముఖ ఎయిర్ లైన్స్ అయిన ఎతిహాద్, ఎమిరేట్స్ కూడా అదే బాట పట్టాయి. ఇప్పటికే 25 నుంచి 50 శాతం మేర వేతనాల్లో కోతలు విధించిన ఈ ఎయిర్ లైన్స్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదేంటి అంటే మరో మూడు నెలలు వరకూ అంటే సెప్టెంబర్ వరకూ వేతనాల కోత కొనసాగనుందని ఉద్యోగులకు సమాచారం ఇచ్చాయి. కరోనా కారణంగా సర్వీసులు అక్కడివి అక్కడే ఆగిపోవటం..ఆదాయం లేకపోవటంతో క్యాష్ రిజర్వ్ లను కాపాడుకునేందుకు ఇంతకు మించిన మార్గంలేదని ఎయిర్ లైన్స్ చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు ఎయిర్ లైన్స్ దివాళా తీయగా..మరికొన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిపోయాయి.

కరోనా కారణంగా మార్చి నుంచి ఈ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎమిరేట్స్ లో లక్షా ఐదు వేల మంది ఉద్యోగులు ఉండగా..ఇందులో కొంత మందిపై ఇఫ్పటికే వేటు పడింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉంది. అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. వేతనాల కోత అనేది కామన్ గా మారింది. ఈ సంస్థ 1200 మంది ఉద్యోగులను తొలగించే సన్నాహాల్లో ఉంది. గల్ఫ్ కు చెందిన మరో ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్ లైన్స్ కూడా తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని ఇంటికి పంపనుంది.

Similar Posts

Recent Posts

International

Share it