ఎమిరేట్స్ రెడీ..మే 21నుంచి ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులు

ఎమిరేట్స్ రెడీ..మే 21నుంచి ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులు

దుబాయ్ కు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ మే 21 నుంచి ప్రయాణికుల సర్వీసులు నడిపేందుకు రెడీ అయింది. ఎనిమిది దేశాలకు చెందిన తొమ్మిది నగరాలకు సర్వీసులు ప్రారంభించనుంది. దుబాయ్ నుంచి ఈ సర్వీసులు ఆస్ట్రేలియా, చికాగో, ఫ్రాంక్ ఫర్ట్, లండన్ హీత్రూ, మాడ్రిడ్, మెల్ బోర్న్, మిలన్, పారిస్, సిడ్నిలకు సర్వీసులు నడపనుంది. కరోనాతో ఆగిన సేవలను ప్రారంభిస్తున్న ఎమిరేట్స్ అటు విమానాశ్రయంతోపాటు విమానాల్లోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. విమాన సిబ్బందితోపాటు ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతే కాదు..విమాన సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ కిట్స్) అందించనున్నారు. విమానంలోని ఖాళీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ప్రయాణికుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

వ్యక్తిగత ప్రయాణికులు, ఫ్యామిలీ గ్రూపుల మధ్య ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు, సిబ్బంది మధ్య కాంటాక్ట్ ను తగ్గించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ కారణంగా ఎలాంటి రిస్క్ లేకుండా చేసేందుకు మ్యాగజైన్లతో పాటు ఇతర ప్రింటింగ్ మెటీరియల్ ను తాత్కాలికంగా విమానాల్లో అందుబాటులో ఉంచరు. కేబిన్ బ్యాగేజ్ ను అనుమతించరు. కేవలం ల్యాప్ టాప్, హ్యాండ్ బాగ్, బేబీ ఐటెమ్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రయాణికులు విధిగా విమానం ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానం చేరే వరకూ మాస్క్ తో పాటు గ్లోవ్స్ వేసుకుని ఉండాల్సిందే. ఎమిరేట్స్ ప్రయాణికుల సర్వీసులను ప్రారంభించనుండటంతో ఇతర ఎయిర్ లైన్స్ కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it