పౌరవిమానయాన శాఖ చేతిలోనే టిక్కెట్ల ధర ఖరారు

పౌరవిమానయాన శాఖ చేతిలోనే టిక్కెట్ల ధర ఖరారు

కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో విమాన టిక్కెట్ల ధరలను మూడు నెలలపాటు తన పరిధిలోనే ఉంచుకోనుంది. ఇప్పటివరకూ ఆయా విమానయాన సంస్థలే టిక్కెట్ ధరలను నిర్ణయించేవి. ఇందులో పెద్దగా ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు. కానీ ఈ సారి మాత్రం మూడు నెలల పాటు ఏ రూట్ లో ఎంత టిక్కెట్ ధర ఎంత ఉండాలనేది మాత్రం పౌరవిమానయాన శాఖ నిర్ణయిస్తుంది. వీటిని అన్ని ఎయిర్ లైన్స్ విధిగా పాటించాల్సిందే. రేట్ల ఖరారుకు విమాన ప్రయాణ సమయం ఆధారంగా ఏడు కేటగిరీలుగా వర్గీకరించారు. 0-40 నిమిషాలు ఒకటో కేటగిరి, 40 నుంచి 60 నిమిషాలు రెండో కేటగిరి, 60 నుంచి 90 నిమిషాలు మూడవ కేటగిరి, 90 నుంచి 120 నిమిషాలు నాలగవ కేటగిరి, 120 నుంచి 150 నిమిషాలు ఐదవ కేటగిరి, 150 నుంచి 180 నిమిషాలు ఆరవ కేటగిరి, 180 నుంచి 210 నిమిషాలు ఏడవ కేటగిరిగా ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

ఢిల్లీ-ముంబయ్ ల మధ్య కనిష్ట ధర 3500 రూపాయలు, గరిష్ట ధర 10000 రూపాయలుగా నిర్ణయించారు. అయితే విమానంలోని 40 సీట్లు కనిష్ట, గరిష్ట ధరల మధ్య సగటు రేటుకే విక్రయించాలని అమ్మాలని తెలిపారు. 2020 వేసవి షెడ్యూల్ లో అనుమతించిన దాని ప్రకారం మూడవ వంతు విమానాలను అనుమతించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రచారం జరిగినట్లుగా మధ్యలో సీట్లను ఖాళీగా ఉంచబోవటం లేదన్నారు. దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని భావించటం లేదన్నారు. అయితే పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనేది ఇఫ్పుడే చెప్పలేమని తెలిపారు. మార్గదర్శకాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనసరి అని ప్రకటించినా..సెల్ఫ్ డిక్లరేషన్ తో అనుమతిస్తామని మంత్రి తెలిపారు.

Similar Posts

Recent Posts

International

Share it