రెక్కల్లో కూర్చోని ఎగిరిపోవచ్చు ఇక!

రెక్కల్లో కూర్చోని ఎగిరిపోవచ్చు ఇక!

చాలా మందికి పక్షుల్లా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే ఎంత బావుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా అయితే ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోవచ్చు. కానీ మనుషులకు అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడు విమానయానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రెక్కలు కట్టుకుని ఎగిరిపోవటం సాధ్యం కాకపోవచ్చు కానీ..విమానం రెక్కల్లో కూర్చుని మాత్రం ఎగిరిపోవటానికి రంగం రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న విమానయానంలో అయితే మధ్యలో సీట్లు ఉంటాయి. రెక్కల మధ్యలో విమానం ఇంజన్లు ఉంటాయి. కానీ ఇప్పుడు రెక్కల మధ్యలో సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజన్లను ‘వి’ షేప్ లో ఉండే విమానం పైన అమర్చబోతున్నారు. ఈ ప్రయోగాత్మక ‘వి’ ఫ్యూచరిస్టిక్ విమానం తొలి దశ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

జర్మనీలోని ఎయిర్ బేస్ లో ఈ ప్రయోగం నిర్వహించారు. కెఎల్ ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్, డెఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ మోడల్ ను అభివృద్ధి చేశాయి. ఈ వి షేప్ విమానాలు రెడీ అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని హై ఎండ్ విమానాల కంటే ఇవి 20 శాతం ఇంథనాన్ని ఆదా చేస్తాయని తెలిపారు. దీంతో పాటు సుదూర ప్రాంత ప్రయాణాలకు కూడా ఎంతో అనువైనదిగా ఉంటుందని గుర్తించారు. 22.5 కేజీల బరువు ఉన్న తొలి వి షేప్ విమానాన్ని ప్రయోగించి చూశారు. ఈ ప్రోటోటైప్ టేకాఫ్, ల్యాండింగ్ అత్యంత సురక్షితంగా సాగింది. ఈ టెస్ట్ ఫ్లైట్ ద్వారా వచ్చిన డేటా ఆధారంగా మరిన్ని మార్పులు చేసి ముందుకు సాగుతామని కెఎల్ ఎం వెల్లడించింది.

Similar Posts

Recent Posts

International

Share it