గ్లోబల్ విలేజ్, దుబాయ్

గ్లోబల్ విలేజ్, దుబాయ్

ప్రపంచ దేశాలు అన్నీ ఒక్క చోట ఉంటే అదే ‘గ్లోబల్ విలేజ్’. తొంభై దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు ఒక్క చోట చూసే అవకాశం కల్పించారు ఈ దుబాయ్ గ్లోబల్ విలేజ్ లో. షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ రోడ్డులో ఈ గ్లోబల్ విలేజ్ ఉంటుంది. పర్యాటకులు ఈ ప్రాంతం మొత్తాన్ని సందర్శించాలంటే కనీసం ఒక రోజు పెడుతుంది. అంతే కాదు అక్కడే షాపింగ్..సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో. గ్లోబల్ విలేజ్ లో నడిచే ఒళ్ళు గగుర్పొడిచే షోలు..లైవ్ ఈవెంట్స్ ఉంటాయి.

ప్రతి దేశానికి సంబంధించి సంస్కృతి..సంప్రదీయాలతో ఈ విలేజ్ ను డెవలప్ చేశారు. ప్రతి చోటా ఆయా దేశాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతారు. దుబాయ్ లో వాతావరణం చల్లగా ఉన్న సమయంలో మాత్రమే గ్లోబల్ విలేజ్ తెరిచి ఉంటుంది. అతి పెద్ద షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్ కేంద్రంగా ఈ ప్రాంతం విరాజిల్లుతుంది. ఇక్కడ వివిధ దేశాలకు చెందిన పెవిలియన్లు ఉంటాయి. ఒక్క చోటే ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులు తెలుసుకునే అవకాశం అంటే ఓ వినూత్నమైన అనుభూతిగానే చెప్పుకోవచ్చు.

గ్లోబల్ విలేజ్ వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=gfXQYwpSu7k

Similar Posts

Recent Posts

International

Share it