గోవాకు పెరుగుతున్న విమాన సర్వీసులు

గోవాకు పెరుగుతున్న విమాన సర్వీసులు

దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో గోవా అగ్రభాగాన ఉంటుంది. కరోనాతో కళతప్పిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది.. కొద్ది రోజుల క్రితమే గోవా పర్యాటకులకు అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో గోవాకు నడిచే విమాన సర్వీసుల సంఖ్యలో కూడా గణనీయమైన పురోగతి కన్పిస్తోంది. దేశంలో కరోనా విస్తృతి ఎక్కడా తగ్గుముఖం పట్టినట్లు కన్పించటం లేదు.

అయినా సరే గోవాకు వచ్చే పర్యాటకులు మాత్రం ఆగటం లేదు. మేలో గోవా విమానాశ్రయంలో ఫ్లైట్ మూమెంట్స్ 59 ఉండగా, జూన్ నాటికి 265కి, జులైలో ఇది ఏకంగా 318కి పెరిగింది. గోవాలో విమాన సర్వీసులు సాదారణ స్థితికి వస్తున్నాయని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో పెద్దగా హడావుడి లేకపోవటంతో చాలా మంది ప్రయాణికులు గోవా బాట పడుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it