గోవాలో పర్యాటకం ఓపెన్

గోవాలో పర్యాటకం ఓపెన్

గోవా అత్యంత కీలక ప్రకటన చేసింది. మే 17 తర్వాత రాష్ట్రంలో పర్యాటకులను అనుమతించటానికి రెడీ అయిపోయింది. గోవాలో కరోనా కేసులు కూడా అత్యంత తక్కువ నమోదు అవటం..నమోదు అయిన కేసులు కూడా క్యూర్ కావటంతో పర్యాటకంపై ఆధారపడిన సర్కారు ఈ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీని కోసం ప్రత్యేక విధివిధానాలు ఖరారు చేస్తోంది. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు మాత్రం ప్రస్తుతానికి అనుమతి లేదని చెబుతోంది. గోవా అంతటా ప్రస్తుతం గీన్ జోన్ గానే ఉంది. మే 17 తర్వాత కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ప్రభుత్వ విధివిధానాలతో పర్యాటకుల్ని అనుమతిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

లాక్‌డౌన్‌3.0 తరువాత కొన్ని పరిమితులతో బస్సు , రైలు , విమానాల ద్వారా అంతర్-రాష్ట్ర మార్గాల్లో ప్రయాణాలను అనుమతించాలని గోవా సీఎం సోమవారం నాటి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీని కోరారు. రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తిరిగి రూపొందించే పనిలో ఉందన్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ పాతాళానికి పడిపోయిన పర్యాటక ఆదాయాన్ని సాధించేందుకు పరిమాణాత్మక విధానానికి బదులుగా గుణాత్మక ఆచరణపై దృష్టి సారించినట్టు సీఎం సావంత్ చెప్పారు.

Similar Posts

Recent Posts

International

Share it