గోల్కొండ కోట

గోల్కొండ కోట

హైదరాబాద్‌లో ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాల్లో గోల్కొండ కోట ఒకటి. 13వ శతాబ్దపు నాటి కోట ఇది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండను కేంద్రంగా చేసుకుంది. దీంతో ఈ కోటకు ఇప్పుడు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. కాకతీయులు,కుతుబ్ షాహీ వంశస్తుల కాలంలో ఈ కోటను నిర్మించారు. ఈ కోట మొత్తాన్ని 120 మీటర్ల ఎత్తు అయిన నల్లరాతి కొండ మీద నిర్మించారు. కోట రక్షణార్థం చుట్టూ బురుజు కూడా ఉంది. ఈ కోట అసలు పేరు గొల్లకొండ. క్రమక్రమంగా ఇది గోల్కొండగా రూపాంతరం చెందింది. 114లో మంగళవరం అనే రాళ్ళగుట్ట పైన ఓ గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించే కాకతీయుల చెవిన పడింది. వెంటనే ఆ పవిత్ర స్థలంలో రాజు ఒక మట్టి కట్టడాన్ని నిర్మించారు. కాకతీయులకు, వారి వారసులు ముసునూరి నాయకులకు గోల్కొండ ఓరుగల్లు సామ్రాజ్యంలో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుత 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. తర్వాత ముసునూరి నాయకులు విప్లవంతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తం అయింది. గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదాని చుట్టూ మరొకటి నిర్మించారు. కోటను పెంచటంలో,పటిష్ఠపరచటంలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించటం కష్టమని భావించిన నిజాం గుట్టను కోట లోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు.

సందర్శన వేళలు: ఉదయం9 గంటల నుంచి సాయంత్రం5.30 గంటల వరకూ

https://www.youtube.com/watch?v=28AepinYzoI

Similar Posts

Recent Posts

International

Share it