గుర్రంకొండ కోట

గుర్రంకొండ కోట

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో గుర్రంకొండ కోట ఒకటి. ఈ కోటకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. శత్రుదుర్బేధ్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు పునర్ నిర్మించారు. నిర్మాణం మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్పకొండపై ఉంది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంటుంది. నాలుగోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంటుంది. కోటలో నలభైకి పైగా మసీదులు ఉండేవి.కానీ అవి ప్రస్తుతం శిథిల స్థితిలో ఉన్నాయి. పర్షియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింప జేశాడు.

ఈ కోట 18వ శతాబ్దపు చివరలో కొన్నాళ్లు టిప్పు సుల్తానుల ఆధీనంలో ఉంది. టిప్పు సుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటు చేశాడు. ఆ తరువాత కడప నవా బుల పాలనలోకి వచ్చింది. ఇక్కడ గల కోట చాలా ప్రసిద్ధమైనది. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది. తమ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విజయనగర పాలకులు గుర్రంకొండ దుర్గాన్ని 400 ఏళ్ళ కిందట నిర్మించారు. అయితే హైదర్‌ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్‌ మహారాష్ట్ర నుండి ఈ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు.

Similar Posts

Share it