హంసలదీవి

హంసలదీవి

ఈ ప్రాంతానికో విచిత్రమైన చరిత్ర ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవటమూ ఓ ఆసక్తికర అంశమే. హంసలదీవి క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుంది కనుకనే ఈ పేరు స్థిరపడిందని చెబుతారు. అందరి పాపాలను కడిగేస్తూ వెళ్లిన కారణంగా గంగానది మలినమైపోతుంది. దాంతో ఆమె తన దుస్థితిని శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించాలని, ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని చెప్పాడు.

ఆ క్షేత్ర మహిమ కారణంగా హంసగా మారాక తిరిగి ఎప్పటిలానే పవిత్రతతో ప్రవహించాలని సూచించాడు. సకల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ వెళుతోన్న కాకి కృష్ణవేణి సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగి లేవగానే హంసగా మారిపోయింది. అందుకే దీనిని హంసలదీవిగా పిలుస్తారని స్థలపురాణం చెబుతోంది. హంసల దీవి వద్దే కృష్ణా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు అక్కడ ఉన్న వేణుగోపాల స్వామి మందిరాన్ని కూడా దర్శించుకుంటారు.దీనిని శ్రీ వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా చెబుతారు.

Similar Posts

Recent Posts

International

Share it