హైదరాబాద్ నుంచి దుబాయ్ కు విమాన సర్వీసులు

హైదరాబాద్ నుంచి దుబాయ్ కు విమాన సర్వీసులు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ కి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఎయిర్ బబుల్ లో భాగంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ యూఏఈతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సర్వీసులు నడుపుతున్నారు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఈ సర్వీసులను ప్రారంభించింది. భారత్ ఇప్పటికే ఎయిర్ బబుల్ కింద పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుని విమాన సర్వీసులు నుడుపుతున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలోకి ఇఫ్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా చేరింది.

హైదరాబాద్ నుంచి దుబాయ్ కు మంగళ, గురు, ఆదివారాల్లో సర్వీసులు నడవనున్నారు. ఇప్పటికే ఈ సర్వీసులు ప్రారంభం కావటంతో దుబాయ్ వెళ్లే పర్యాటకులు, ఇతర అవసరాలు ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా నేరుగా హైదరాబాద్ నుంచే దుబాయ్ వెళ్ళొచ్చు. అయితే దుబాయ్ మాత్రం కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తోంది.

Similar Posts

Recent Posts

International

Share it