ఢిల్లీ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్స్ కోసం ‘ప్రత్యేక టెర్మినల్’

ఢిల్లీ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్స్ కోసం ‘ప్రత్యేక టెర్మినల్’

గత కొంత కాలంగా దేశంలో ప్రైవేట్ జెట్ విమానాల హవా పెరిగింది. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మొదలుకుని..పారిశ్రామికవేత్తలు..కాంట్రాక్టర్లు నిత్యం ప్రైవేట్ జెట్ విమానాలు వాడుతున్నారు. దేశంలో తొలిసారి ప్రైవేట్ జెట్స్ వాడే వారి కోసం ‘ప్రత్యేక టెర్మినల్’ అందుబాటులోకి వచ్చింది. అది దేశ రాజధాని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (డిఐఏఎల్)లో. జీఎంఆర్ ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ రెగ్యులర్ ప్రయాణికుల మార్గంలోని ప్రైవేట్ జెట్ ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించాల్సి వచ్చింది.

ఇప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక టెర్మినల్ ను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ప్రత్యేక టెర్మినల్ ను ప్రారంభించారు. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయానికి ఇది ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు. ఈ దీపావళి నాటికి దేశంలో విమాన ప్రయాణికులు సంఖ్య సాదారణ స్థితికి వస్తుందని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త టెర్మినల్ లో 57 పార్కింగ్ బే లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ప్రతి రోజూ 150 ప్రైవేట్ జెట్స్ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ టెర్మినల్ లో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it