ఇండిగో ప్రయాణికుడికి కరోనా వైరస్

ఇండిగో ప్రయాణికుడికి కరోనా వైరస్

దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయిన ఆనందం ఓ వైపు. కరోనా టెన్షన్ మరోవైపు. ఈ తరుణంలో ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి విమాన సర్వీసులు ప్రారంభం అయిన తొలి రోజు చెన్నయ్ నుంచి కోయంబత్తూరుకు ఇండిగో విమానంలో వెళ్లారు. అదే విమానంలో మొత్తం వంద మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఎవరూ కూర్చోలేదని ఇండిగో వెల్లడించింది.

బాధితుడికి ప్రస్తుతం కోయంబత్తూరులోని ఈఎస్ఐ స్టేట్ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా సోకటంతో ఇందులో ప్రయాణించిన సిబ్బందిని 14 రోజుల సర్వీసులకు దూరంగా ఉంచనున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య పెరిగితే అసలు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన సిబ్బంది ఎయిర్ లైన్స్ వద్ద ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it