బ్యాంకాక్..సింగపూర్ లకు త్వరలో విమాన సర్వీసులు

బ్యాంకాక్..సింగపూర్ లకు త్వరలో విమాన సర్వీసులు

భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. దీని కోసం ఏకంగా 13 దేశాలతో చర్చలు ప్రారంభించనుంది. ఎయిర్ బబుల్ కింద ఈ సర్వీసులు ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆస్ట్రేలియాతోపాటు జపాన్, సింగపూర్ లతో విడిగా ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు. కొన్ని పరిమితులతో ఆయా దేశాలు విమానాలు నడుపుకోవటానికి అవకాశం ఉంటుంది. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ లతో కూడా ఎయిర్ బబుల్ ఒప్పందాలు ఉంటాయన్నారు.

జులై నుంచి భారత్ అమెరికాతోపాటు యూకె, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతార్, మాల్దీవులకు ఎయిర్ బబుల్ కింద ఒప్పందాలు చేసుకుని విమాన సర్వీసులు నడుపుతోంది. భారత్ చర్చలు జరిపే దేశాల్లో ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే ఆయా దేశాలు అంగీకరిస్తేనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. కరోనా కేసుల సంఖ్య ఆధారంగానే ఆయా దేశాలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Similar Posts

Recent Posts

International

Share it