విమానయానం ఎంత వరకూ సేఫ్?!

విమానయానం ఎంత వరకూ సేఫ్?!

‘ఇండిగో’ ఉదంతంతో పెరుగుతున్న అనుమానాలు

ఆరోగ్యసేతు యాప్ ఆ కరోనా పాజిటివ్ పేషంట్ ను గుర్తించలేదా?. ఆరోగ్యసేతు యాప్ లో గ్రీన్ ఉంటేనే విమానాశ్రయంలోకి..విమానంలోకి అనుమతిస్తామని ప్రకటించారు. ఒకటి కాదు..రెండుసార్లు థర్మల్ స్క్రీనింగ్ చేస్తామన్నారు. ప్రయాణ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ తప్పనిసరి అన్నారు. అంతా ఓకే. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇండిగో విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది?. అంటే చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేటతెల్లం అవుతోంది. తాజాగా ఇండిగో విమానంలో ప్రయణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలటం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తుల విషయంలో వైరస్ ఒకరి నుంచి మరోకరికి సోకుతుందా లేదా అన్న విషయం కేవలం వైద్యనిపుణులు మాత్రమే తేల్చాల్సిన అంశం. ఈ లెక్కన కరోనా కేసులు భారీ సంఖ్యలో ఉన్న ప్రాంతాల నుంచి, ఆయా ప్రాంతాలకు విమానయాన ప్రయాణం అంత సురక్షితమైన అంశం కాదని తేలుతోంది.

ఎందుకంటే తమిళనాడులో పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. ఇప్పుడు చెన్నయ్ నుంచి ఇండిగో విమానంలో కోయంబత్తూరుకు వెళ్ళిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఆరోగ్యసేతు యాప్ లో గ్రీన్ చూపించటం, ఇతర జాగ్రత్తలు విమాన ప్రయాణికులను కరోనా నుంచి ఏమీ రక్షించలేవని తేలినట్లు అయింది. చివరకు ఇండిగో విమాన సిబ్బందిని కూడా 14 రోజుల పాటు విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే ఇప్పటికిప్పుడు విమాన ప్రయాణం రిస్క్ తో కూడిన వ్యవహారమ అని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప..కొంత కాలం ప్రయాణాలకు దూరంగా ఉండటమే బెటర్ అనే అబిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it