జగిత్యాల కోట

జగిత్యాల కోట

జగిత్యాల ఖిల్లాను 1747లో ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించారు. ఈ ఖిల్లా అప్పట్లో సైనికుల స్థావరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. రాతితో కట్టిన ఈ కోట సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ కోట పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందుగుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.

జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జగిత్యాల ఖిల్లా.

Similar Posts

Recent Posts

International

Share it