జమలాపురం

జమలాపురం

చుట్టూ పచ్చటి పొలాలు..మరో వైపుకొండలు. ఎత్తైన కొండపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి. ఈ జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతి అంటారు. అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో ముఖ్యంగా శనివారం నిర్వహించే పూజలు, ప్రార్థనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్థన చేస్తే కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి అతి దగ్గరలో జాబాలి మహర్షి కి సంబంధించిన సూసి గుట్ట అనే కొండ ఉంది. ఈ మహర్షి ఇక్కడ తీవ్రంగా తపస్సు చేయడం వల్ల వేంకటేశ్వరస్వామి దర్శన మిచ్చి ఆయనను దీవించాడని విశ్వసిస్తారు.

జమలాపురం ఆలయం ఖమ్మం ప్రధాన నగరం నుండి 124 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

https://www.youtube.com/watch?v=qKKHSz5sZTI

Similar Posts

Recent Posts

International

Share it