ఖమ్మం ఖిల్లా

ఖమ్మం ఖిల్లా

జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ‘ఖమ్మం ఖిల్లా’ ఒకటి. ఖమ్మం నగరం మధ్యలో స్తంభాద్రి అనే కొండపై ఉన్నది ఇది. కాకతీయుల పాలనాకాలం క్రీ.శ. 950లో ఖమ్మం ఖిల్లా నిర్మాణానికి పునాదులు పడ్డాయి. తర్వాత రెడ్డిరాజులు, వెలమరాజులు ఈ కోటను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత వచ్చిన కుతుబ్ షాహీ వంశస్తులు(1531) కూడా ఈ కోటను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.కాకతీయుల కాలంలో ముగ్గురు సోదరులు - రంగారెడ్డి, లక్నారెడ్డి,వేమారెడ్డి 950లో కోటను కట్టడం ప్రారంభించారు. తొలుత అది మట్టికోట. 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి ఈ కోట నిర్మాణం కొనసాగించారు. క్రీ.శ. 1000లో కోట కట్టడం పూర్తయింది. నిర్మాణం అయ్యాక ౩౦౦ ఏళ్ల పాటు రెడ్డి వంశాల పాలనలో ఉంది. ఆ తరువాత వెలమరాజులు చేజిక్కించుకొన్నారు.అనంతరం నందపాని, కాళ్లూరు, గుడ్లూరు వంశాల చేతులు మారింది.సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు.

అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది.గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు పది ద్వారాలున్నాయి.పశ్చిమం వైపున్న దిగువ కోట ప్రధాన ద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60ఫిరంగులు మోహరించే వీలుంది. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహలు ఉన్నాయి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉంది. కోట ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=1WacJHrpQ14

Similar Posts

Recent Posts

International

Share it