కోరుకొండ

కోరుకొండ

కోరుకొండ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, గ్రామం.కోరుకొండ జిల్లా రాజధాని కాకినాడకు 60కి.మీ., రాజమండ్రికి 20కి.మీ., అమలాపురానికి 110 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. 120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువుగా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు.స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తులో ఉంటుంది.

ఈ ఆలయంలో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభం ఉంది. ఈ దేవాలయాన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఈ గుడి, కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700–-800 క్రీ.శ.లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. శ్రీనాథ కవిసార్వభౌముడు తన కవితాసంపుటంలో కోరుకొండను వేదాద్రిగా వర్ణించాడు.

Similar Posts

Recent Posts

International

Share it